Abn logo
Sep 25 2021 @ 03:59AM

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కన్నుమూత

మాచర్ల, సెప్టెంబరు 24 : గుంటూరు జిల్లా మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి (78) శుక్రవారం తెల్లవారుజామున   కన్నుమూశారు. నాలుగుమాసాల క్రితం కరోనా బారినపడిన లక్ష్మారెడ్డి కోలుకున్నారు. పక్షంరోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించగా బ్లడ్‌క్యాన్సర్‌గా తేలింది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స నిర్వహించినా కోలుకోలేకపోయారు. వైద్యులు నిస్సహాయత వ్యక్తపరచడంతో గురువారం రాత్రి లక్ష్మారెడ్డిని మాచర్ల స్వగృహానికి తీసుకొచ్చారు. ఉదయాన్నే ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. పిన్నెల్లి లక్ష్మారెడ్డి  2004-2009లో మాచర్ల శాసనసభ్యుడిగా సేవలందించారు.

క్రైమ్ మరిన్ని...