వైసీపీ కౌన్సిలర్ శేషాద్రి వికృతచేష్టలు

ABN , First Publish Date - 2022-05-18T22:05:31+05:30 IST

వైసీపీ కౌన్సిలర్ శేషాద్రి వికృతచేష్టలు

వైసీపీ కౌన్సిలర్ శేషాద్రి వికృతచేష్టలు

శ్రీసత్యసాయి: జిల్లాలోని పెనుకొండలో వైసీపీ కౌన్సిలర్ శేషాద్రి వికృతచేష్టలకు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. ప్రేమిస్తున్నానంటూ వివాహితకు వైసీపీ కౌన్సిలర్ శేషాద్రి వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె వాపోతుంది. వివాహిత భర్తను మద్యానికి బానిస చేసి ఇంటి వద్దకు వచ్చి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టడం రాళ్లు వేయడం లాంటి పనులు చేస్తున్నారంటూ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ కౌన్సిలర్ శేషాద్రికి లొంగ లేదన్న సాకుతో  యాక్సిడెంట్ చేసి తీవ్ర గాయాల పాలు చేశారంటూ వివాహిత  రోదిస్తుంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ వివాహిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. చెప్పుతో కొట్టినా వెంటాడి వేధిస్తున్నాడంటూ ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-05-18T22:05:31+05:30 IST