Anantapur: గుంతకల్లు పొట్టి శ్రీరాములు కూడలిలో ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళలు గౌరవానికి భంగం కలిగించిన ఎంపీని అరెస్టు చేయాలంటూ ఆయన దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య కాసేపు తోపులాట జరిగింది. టూ టౌన్ సీఐ చిన్న గోవిందు టీడీపీ కార్యకర్తల చేతుల్లోని మాధవ్ దిష్టిబొమ్మను లాక్కోవడంతో.. పోలీసులు జులుం నశించాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపై ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఇవి కూడా చదవండి