గుంటూరు: జిల్లాలోని కొలకలూరులో డయేరియా బాధపడుతున్న 64 మంది బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని టీడీపీ నేత పాతర్ల రమేష్ డిమాండ్ చేశారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. మృతురాలు శ్రీనిధి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించాలన్నారు. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.
ఇవి కూడా చదవండి