హైకోర్టు ఉద్యోగుల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-01-28T09:13:41+05:30 IST

హైకోర్టు ఉద్యోగుల వినూత్న నిరసన

హైకోర్టు ఉద్యోగుల వినూత్న నిరసన

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు ఉద్యోగులు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. భోజన విరామ సమయంలో ముక్కుపై వేలు వేసుకొని హైకోర్టు వద్ద ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ పతాకానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు మాట్లాడుతూ అశుతోశ్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీవో విడుదల చేయడం తమను ఆశ్చర్యానికి, తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. అందుకే ముక్కుపై వేలు వేసుకొని నిరసన తెలియజేశామన్నారు. పీఆర్సీ విషయంలో సీఎం నేరుగా ఉద్యోగులతో చర్చించాలని కోరారు. ప్రస్తుత జీవోను వెంటనే రద్దుచేసి అందరికీ ఆమోదయోగ్యమైన జీవో విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు సురేంద్రనాథ్‌, సతీశ్‌వర్మ, కోటేశ్వరరావు, సీతాఫణికుమారి, లక్ష్మీప్రసన్న, హైకోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T09:13:41+05:30 IST