ఏపీలో అతిచిన్న జిల్లాగా విశాఖ.. విస్తీర్ణంలో ఆ జిల్లానే టాప్!

ABN , First Publish Date - 2022-01-28T08:55:07+05:30 IST

ఏపీలో అతిచిన్న జిల్లాగా విశాఖ.. విస్తీర్ణంలో ఆ జిల్లానే టాప్!

ఏపీలో అతిచిన్న జిల్లాగా విశాఖ.. విస్తీర్ణంలో ఆ జిల్లానే టాప్!

విస్తీర్ణంలో ఒంగోలు టాప్‌ 

జనాభాలో కర్నూలుది అగ్రస్థానం 

గిరిజన జిల్లాల్లో 10లక్షల లోపే జనాభా 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో భోగౌళిక విస్తీర్ణంలో ఒంగోలు జిల్లా టాప్‌లో నిలిచింది. 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జిల్లా విస్తరించి ఉంది. రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 8.8 శాతం ఈ ఒక్క జిల్లాలోనే ఉంది. 12,251 చ.కి.మీ. విస్తీర్ణంతో అల్లూరి సీతారామరాజు జిల్లా (9.54ు) రెండోస్థానంలో నిలిచింది. ఇంతకు ముందు విస్తీర్ణంలో పెద్ద జిల్లాగా ఉన్న అనంతపురం ఇప్పుడు 11,359 చ.కి.మీ.తో (7శాతం) మూడో స్థానంలో ఉంది. 928 చ.కి.మీ. విస్తీర్ణం మాత్రమే ఉన్న విశాఖపట్నం జిల్లా (0.6ు) చివరి స్థానంలో నిలవడం విశేషం. ఇక జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల మందితో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాతో పాటు అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, శ్రీబాలాజీ, శ్రీకాకుళం, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలు 20 లక్షలపైనే జనాభాను కలిగి ఉన్నాయి. గిరిజన జిల్లాలైన మన్యం జిల్లాలో 9.72 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9.54 లక్షల జనాభా ఉంది.  14 జిల్లాల్లో ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. 10 జిల్లాల్లో మూడు చొప్పున రెవెన్యూ డివిజన్‌లున్నాయి. ఒంగోలులో అత్యధికంగా 38 మండలాలు ఉండగా నెల్లూరులో 35, శ్రీబాలాజీలో 35, అనంతపురంలో 34, కడపలో 34 చొప్పున ఉన్నాయి. 

Updated Date - 2022-01-28T08:55:07+05:30 IST