విశాఖపట్నం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాలపైకి సముద్రం మీదుగా తేమగాలులు వీచాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు దట్టంగా మంచు కురిసింది. ఉదయం పది గంటల వరకు మంచు ప్రభావం కొనసాగింది. దీంతో వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖలో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, కొన్నిచోట్ల తక్కువగా నమోదయ్యాయి.