వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం నిర్వహించిన సమీక్షలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌తోపాటు సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.