టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-24T07:49:48+05:30 IST

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అరెస్టు

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అరెస్టు

నోటీసులివ్వకుండా బెంగళూరులో అదుపులోకి

పోస్టింగులు పెట్టారంటూ కేసు

రాత్రి 9 గంటలకు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు


చిత్తూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి, వీడియో విడుదల చేశారనే కారణంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీ్‌పను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరులోని 44వ డివిజన్‌కు చెందిన వైసీపీ ఇన్‌చార్జి అల్తాఫ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీ్‌పను బెంగళూరులోని ఆయన నివాసంలో నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సూచన మేరకు సందీప్‌ తన కారులో భార్య, పిల్లలతో బెంగళూరు నుంచి చిత్తూరుకు బయల్దేరారు. రాష్ట్ర సరిహద్దు నంగిలి వద్ద సందీ్‌పను మాత్రమే పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన భార్య అనూషతో దురుసుగా మాట్లాడారు. మరో కోణాన్ని చూపిస్తామంటూ బెదిరించారు. కోలార్‌ నుంచి పోలీసు వాహనంలో సందీ్‌పను గంగవరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ గంటసేపు ఉంచి, మళ్లీ మరో వాహనంలో పలమనేరు స్టేషన్‌కు తెచ్చారు. అక్కడ్నుంచి చిత్తూరుకు బయల్దేరి మొగలి వద్ద యూటర్న్‌ తీసుకుని బంగారుపాళ్యం నుంచి తవణంపల్లె మీదుగా పూతలపట్టుకు తీసుకొచ్చారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు చిత్తూరు జిల్లా కోర్టుకు తీసుకు వచ్చారు.  చిత్తూరు వన్‌టౌన్‌తో పాటు ఐరాల, బీఎన్‌ఆర్‌ పేట పోలీ్‌సస్టేషన్‌లో మరో రెండుకేసులు నమోదు చేశారు. రాత్రి 9 గంటలకు చిత్తూరు కోర్టు సందీ్‌పకు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదల చేశారు. కాగా సందీప్‌ తల్లి శ్రీదేవి, భార్య అనూషను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రతి తప్పుడు కేసుకు, ప్రతి వేధింపునకూ వడ్డీతోసహా చెల్లిస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-24T07:49:48+05:30 IST