Abn logo
Oct 24 2021 @ 02:23AM

నేడే ఆర్కే సంస్మరణ సభ

ఆలకూరపాడులో ఏర్పాట్లు


టంగుటూరు, అక్టోబరు 23 : అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన మావోయిస్టు పార్టీ  కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ(ఆర్కే) సంస్మరణ సభ 24న ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో జరగనుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘం నేతృత్వంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కాగా, రాంగూడ ఎన్‌కౌంటర్లో అమరుడైన ఆర్కే, శిరీషల కుమారుడు పృథ్వీ అలియాస్‌ మున్నా ఐదో వర్ధంతి ఈ నెల 24న కావడంతో ఆర్కే సంస్మరణ కార్యక్రమం కూడా అప్పుడే జరపాలని నిర్ణయించారు.