బకాయిలు చెల్లించకుండా ప్రజలను బాదడం ఏమిటి?

ABN , First Publish Date - 2022-08-13T08:46:21+05:30 IST

బకాయిలు చెల్లించకుండా ప్రజలను బాదడం ఏమిటి?

బకాయిలు చెల్లించకుండా ప్రజలను బాదడం ఏమిటి?

తాజా ట్రూ అప్‌ చార్జీల వాతపై టీడీపీ ఆగ్రహం


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం తాను చెల్లించాల్సినవి చెల్లించకుండా... బకాయిపడితే అవి వసూలు చేసుకోలేక, ప్రజలను బాదడం ఏమిటి? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ట్రూ అప్‌ చార్జీల పేరుతో కరెంటు బిల్లులు పెంచాలని విద్యుత్‌ సంస్థలు ప్రతిపాదించడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం శుక్రవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వివిధ వర్గాలకు రాయితీపై విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ రాయితీ భారాన్ని ప్రభుత్వం భరించి ఆ మేరకు విద్యుత్‌ సంస్థలకు తాను చెల్లింపులు చేయాలి. ఈ పద్దు కింద విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం రూ.15,000 కోట్లు బకాయి పడింది. ప్రభుత్వ కార్యాలయాలు చాలాకాలంగా కరెంటు బిల్లులు కట్టడం లేదు. ఆ బకాయిలు రూ.10వేల కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం డబ్బులిస్తే ప్రభుత్వ శాఖలు బిల్లులు కడతాయి. విద్యుత్‌ సంస్థలు ఇప్పుడు రూ.20,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులిస్తే అవి లాభాల్లోకి వస్తాయి. ప్రభుత్వం డబ్బులు ఇవ్వక నష్టాలు వస్తే చార్జీలు ఎందుకు పెంచాలి? ప్రజలు ఎందుకు భరించాలి’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-08-13T08:46:21+05:30 IST