పోతానన్నా.. పొగబెట్టారు!

ABN , First Publish Date - 2022-08-13T08:49:15+05:30 IST

పోతానన్నా.. పొగబెట్టారు!

పోతానన్నా.. పొగబెట్టారు!

కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్‌ నాగభూషణం సస్పెన్షన్‌

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ 


కలికిరి, ఆగస్టు 12: పాలకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సూపరింటెండెంట్‌ నాగభూషణం అందరూ అనుకున్న విధంగానే సస్పెన్షన్‌కు గురయ్యారు. యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్‌ రంగ జనార్దన్‌ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెడ్డి రాజ్యంలో తనలాంటి బీసీలు ఉద్యోగాలు చేయలేమని, అందుకే త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకోబోతున్నానని గత బుధవారం నాగభూషణం ఒక వీడియో విడుదల చేశారు. దీనిపై ‘జేఎన్టీయూలో కులాల కుంపటి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం కథనం ప్రచురించింది. నాగభూషణాన్ని సస్పెండ్‌ చేసేందుకు ఉన్నతస్థాయి కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు ఆ కథనంలో పేర్కొంది. 24 గంటలు కూడా గడవక ముందే ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిన విషయాన్ని యూనివర్సిటీ యాజమాన్యం కార్యాచరణలోకి తెచ్చింది.

Updated Date - 2022-08-13T08:49:15+05:30 IST