జాతీయ జెండా దిమ్మె ధ్వంసం!

ABN , First Publish Date - 2022-08-13T08:04:09+05:30 IST

జాతీయ జెండా దిమ్మె ధ్వంసం!

జాతీయ జెండా దిమ్మె ధ్వంసం!

టీడీపీ వాళ్లు కట్టారని అక్కసు

పంచాయతీ తీర్మానం లేదని తొలగింపు

వైసీపీ నేతల అకృత్యాలకు పరాకాష్ఠ


పెదవేగి, ఆగస్టు 12: దేశమంతా 75 వసంతాల స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితేలుతుండగా.. వైసీపీ నాయకులు మాత్రం దీనిలోనూ రాజకీయాలే చూస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన గ్రామస్థులు గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు భూమిలో సిమెంట్‌తో జాతీయ జెండా ఏర్పాటుకు దిమ్మె నిర్మించారు. దానిపై జాతీయ జెండా ఎగరేశారు. టీడీపీ మద్దతుదారులు చేసిన ఈ పని.. అధికార వైసీపీకి చెందిన పంచాయతీ పాలకవర్గానికి నచ్చలేదు. పంచాయతీ అనుమతి లేదనే సాకుతో శుక్రవారం రాత్రి పోలీసు బందోబస్తుతో దిమ్మెను తొలగించారు. అడ్డుకున్న టీడీపీ వర్గీయులను పోలీసులు చెదరగొట్టారు. ఆ స్థలంలోనే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అంబేడ్కర్‌ విగ్రహాలు,  రైతు భరోసా కేంద్రం కూడా ఉన్నాయి. అలాంటిది అనుమతి లేదనే సాకుతో జాతీయ జెండా దిమ్మెను ధ్వంసం చేయడం ఏమిటని టీడీపీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-08-13T08:04:09+05:30 IST