ఆ వీడియో ఒరిజినల్‌ అది సీఎంకూ తెలుసు: నాగుల్‌మీరా

ABN , First Publish Date - 2022-08-13T08:21:11+05:30 IST

ఆ వీడియో ఒరిజినల్‌ అది సీఎంకూ తెలుసు: నాగుల్‌మీరా

ఆ వీడియో ఒరిజినల్‌ అది సీఎంకూ తెలుసు: నాగుల్‌మీరా

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో కాల్‌ నిజమని, న్యూడ్‌ వీడియో ఒరిజినల్‌ అని సీఎం జగన్‌రెడ్డి మనస్సాక్షికి తెలుసని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా వ్యాఖ్యానించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సమర్థిస్తున్నందునే వైసీపీ నేతలు పదేపదే తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. మాధవ్‌ న్యూడ్‌ వీడియోపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, మహిళా కమిషన్‌, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నా.. ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు.  


మాధవ్‌ చర్యలతో ఇంకా స్వాతంత్య్రం రానట్లుంది!

గతంలో గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన దేశ అత్యున్నత పార్లమెంట్‌.. నేడు ఎంపీ గోరంట్ల మాధవ్‌ లాంటి వారితో దాని ప్రతిష్ఠ దిగజారుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లయినా.. మాధవ్‌ లాంటి ఎంపీల వల్ల ఇంకా స్వాతంత్య్రం రానట్లే ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ మాధవ్‌ లాంటి ఆంబోతును పార్లమెంట్‌కు పంపిస్తున్నందుకు ఏపీ ప్రజలతో పాటు భారతదేశమంతా అసహ్యించుకుంటోందని మాణిక్యాలరావు అన్నారు. 

Updated Date - 2022-08-13T08:21:11+05:30 IST