‘బీరు’ లారీ బోల్తా .. ఆపై.. ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ

ABN , First Publish Date - 2022-05-23T08:52:34+05:30 IST

‘బీరు’ లారీ బోల్తా .. ఆపై.. ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ

‘బీరు’ లారీ బోల్తా .. ఆపై.. ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ

1275 కేసుల బీరు నేలపాలు.. రూ.30లక్షల నష్టం


సింగరాయకొండ, మే 22 : శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఫ్యాక్టరీ నుంచి బీరు లోడుతో వెళ్తున్న లారీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకోగా, స్థానికులు, అటువైపు వెళ్తున్న లారీ డ్రైవర్లు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. పోలీసుల కథనం మేరకు..  రణస్థలం నుంచి బీరు లోడుతో చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్తున్న లారీ మూలగుంటపాడు వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని.. ఆ వేగానికి అవతలివైపు రహదారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. అదే సమయంలో తిరువూరు నుంచి గుంటూరు వెళ్తున్న ట్యాంకరు బోల్తాపడిన  లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కొద్దిసేపటికి స్థానికులతోపాటు, అటుగా వెళ్తున్న ఇతర లారీల డ్రైవర్లు పగలని బీరు బాటిళ్ల కోసం ఎగబడి చేతికందనన్ని పట్టుకుపోయారు. ఈ సంఘటనలో బీరులోడు లారీని నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. రూ.30లక్షల నష్టం వాటిల్లినట్లు వారు అంచనా వేశారు.

Updated Date - 2022-05-23T08:52:34+05:30 IST