కర్నూలు: జిల్లాలోని ఆస్పరి మండలం ముత్తుకూరులో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అస్వస్థతకు కారణం కలుషిత నీరు త్రాగడమే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. నీటి పైప్‌లైన్ మురుగు నీటి కాలువలో ఉందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నీరు త్రాగడానికి ప్రజలు భయపడుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.