బంగాళాఖాతంలో వాయుగుండం

ABN , First Publish Date - 2022-08-10T12:24:01+05:30 IST

బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో వాయుగుండం

కోస్తా, సీమలకు వర్షసూచన

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా మారింది. భువనేశ్వర్‌కు 85 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారానికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, సీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Updated Date - 2022-08-10T12:24:01+05:30 IST