ఆ గ్రామాలకు పాచినీరే..

ABN , First Publish Date - 2022-04-04T13:42:59+05:30 IST

ఆ గ్రామాలకు పాచినీరే..

ఆ గ్రామాలకు పాచినీరే..

పనిచేయని ఫిల్టర్‌ బెడ్లు 

పట్టించుకోని అధికారులు


అనంతపురం, విడపనకల్లు : మండల కేంద్రంలోని సత్యసాయి మంచినీటి సరఫరా ట్యాంక్‌లో ఫిల్టర్‌ బెడ్లు పనిచేయక పోవటంతో 9 గ్రామాలకు ప్రతి రోజూ , పాచినీరు సరఫరా అవుతోంది. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లలో 5 ఫిల్టర్‌ బెడ్లు ఉండగా అందులో ఒక ఫిల్టర్‌ బెడ్‌  శిథిలమైపోయింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్‌కొ ట్టాల గ్రామానికి పైప్‌లైన్‌ వేసి మిగిలిన కొంత మొత్తం లో ఒక ఫిల్టర్‌ బెడ్‌ను నిర్మంచే కార్యక్రమం చేపట్టారు. నిధులు కొరత రావటంతో ఆ నిర్మాణం కాస్త ఆగి పోయింది. దీనికి నిధులు కేటాయించి  పనులు పూర్తి చేస్తే ఉపయోగంలోకి వస్తుంది.  మరో ఫిల్టర్‌ బెడ్‌ పని చేయకుండా పోయింది. దీన్ని మరమ్మతులు చేయించి వాడుకునే అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిపోయింది. మరో రెండు ఫిల్టర్‌ బెడ్లు అంతంత మాత్రంగా పనిచేస్తున్నా.. కాస్త శుద్ధిజలాన్ని అందించేవి. సంవత్సరం నుంచి అవి కూడా పనిచేయడం లేదు. దీంతో 9 గ్రామాలకు పాచి, పురు గులతో నీరు సరఫరా అవుతోంది.  ఒక్క ఫిల్టర్‌ బెడ్‌లో కూడా నీరు  శుద్ధి కాక పోయినా చెరువులోని నీటిని అలాగే సరఫరా చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఉన్న అధికార పక్షం నాయకులు ఫిల్టర్‌ బెడ్ల్‌ విషయమై నానాయాగి చేసి రచ్చ చేసి నేడు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాచి నీటిని ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. కాగా మర మ్మతుల కోసం కాంట్రాక్టర్లును ప్రభుత్వం నియమిం చింది. వారు చిన్న చిన్న పనులు చేయడం బిల్లులు డ్రా చేసుకోవటం తప్ప ఫిల్టర్‌ బెడ్ల మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ సమస్యపై గతంలో టీడీపీ నాయకులు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు ఆందోళన కూడా చేపట్టారు.  అయినా ఎటువంటి చర్యలు లేవు.  

Updated Date - 2022-04-04T13:42:59+05:30 IST