విషాదం... ప్రేమజంట ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-12T23:37:18+05:30 IST

జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విషాదం... ప్రేమజంట ఆత్మహత్య

కర్నూలు: జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో  ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడుమూరు మండలం రామాపురంలో పురుగుల మందు తాగి శాలు (21) యువతి మృతి చెందగా, గొనేగండ్ల మండలం అగ్రహారంలో యువకుడు శివ (21) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2022-07-12T23:37:18+05:30 IST