కాకినాడ: జిల్లాలోని పెద్దపులి కోసం వేట కొనసాగుతుంది. బోన్లు, సీసీ కెమెరాలకు చిక్కకుండా పెద్దపులి కదలికలపే గుర్తించారు. పులిని పట్టుకోవాలని మహారాష్ట్ర తడోబా టైగర్ నిపుణులకు లేఖ రాశారు. పులి మకాం మార్చుతుండడంతో పట్టుకోలేమని మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. పెద్దపులి కదలికలతో గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఏ క్షణంలో ఏమౌతుందోనని ఆందోళన చెందుతున్నారు.