అమరావతి: వైసీపీ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై జనసేన నేత కూసంపూడి శ్రీనివాస్ స్పందించారు. ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం ఏపీలోని బీసీలను అవమానించడమేనని అన్నారు. బీసీల జాబితా నుంచి 26 బీసీ కులాలను తొలగించిన కేసీఆర్ సర్కార్‌పై ఆర్.కృష్ణయ్య కనీసం నోరుమెదపలేదన్నారు. బీసీ కులాల అభివృద్ధికి ఏమీ చేయకపోగా బీసీ నేతనంటూ కోట్లు గడించిన వ్యక్తి ఆర్.కృష్ణయ్య అని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి