ప్రకాశం జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2022-01-25T19:29:30+05:30 IST
ప్రకాశం జిల్లాలో దారుణం
ప్రకాశం: జిల్లాలోని కోమరోలు మండలం అక్కపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల శ్రీనాథ్ అనే బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని దుండగులు నీటికుంటలో పడేసి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.