4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తుంది: షార్ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-08-15T22:29:24+05:30 IST

ఎస్ఎల్వీ - డి1 సెన్సార్ సమస్య కారణంగానే నిర్దిష్ట కక్ష్యలోకి ఉపగ్రహాలని చేరవేయలేక పోయిందని షార్ డైరెక్టర్ రాజరాజన్ అన్నారు.

4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తుంది: షార్ డైరెక్టర్

తిరుపతి: ఎస్ఎల్వీ - డి1 సెన్సార్ సమస్య కారణంగానే నిర్దిష్ట కక్ష్యలోకి ఉపగ్రహాలని చేరవేయలేక పోయిందని షార్ డైరెక్టర్ రాజరాజన్ అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జీఎస్ఎల్వీ - మార్క్3 ద్వారా గగన్ యాన్ ప్రయోగాత్మక ప్రయోగం చేపట్టబోతున్నామని తెలిపారు. గగన్ యాన్ మానవ రహిత ప్రయోగాలు జరిపాకనే పూర్తి ప్రయోగం ఉంటుందన్నారు. గగన్ యాన్ ప్రయోగానికి ఇంకా నాలుగు ప్రధాన గ్రౌండ్ టెస్ట్‌లు చేయాల్సి ఉందన్నారు. అలాగే వ్యోమగాములని సురక్షితంగా తీసుకు రావాలని ఇస్రో ప్రయత్నిస్తుందన్నారు. 2023 ఫిబ్రవరి- జూలై మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్- 3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో 4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తుందన్నారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో 81 రాకెట్లు, మరో మూడు ప్రయోగాత్మక ప్రయోగాలు ఇస్రో నిర్వహించిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-08-15T22:29:24+05:30 IST