200 బస్సుల ఆధునికీకరణ పూర్తి

ABN , First Publish Date - 2022-04-04T16:28:13+05:30 IST

200 బస్సుల ఆధునికీకరణ పూర్తి

200 బస్సుల ఆధునికీకరణ పూర్తి

విశాఖ, ద్వారకాబస్‌స్టేషన్‌: ప్రజా రవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌లోని 200 బస్సులను రీఫిట్‌ చేశారు. వాటిని రోడ్డు టెస్ట్‌ చేసి  రవాణాకు వినియోగిస్తున్నారు. చిన్నచిన్న సాంకేతిక లోపాలు, వైబ్రేషన్‌, ఎలక్ట్రికల్‌, పెయింటింగ్‌ వంటి పనులు పూర్తి స్థాయిలో చేపట్టి ఆధునికీకరించాలని ీ అధికారులు గత ఏడాది సెప్టెంబరు నెలాఖరున నిర్ణయించారు. మొదటి దశలో ఎంపిక చేసిన రెండు వందల బస్సులను రీఫిట్‌ చేసి ఆధునీకరించాలని ఈ ఏడాది మార్చి నెలాంతానికి ఈ పనులు పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ రీజియన్‌లో పది డిపోలకు ఉన్న గ్యారేజీల్లో ఈ పనులు చేయాలని నిర్ణయించారు. రీజియన్‌కు ఉన్న 1051 బస్సుల్లో 200 బస్సులను ఎంపిక చేశారు. ఇందులో దూర ప్రాంతాలకు తిరిగే బస్సులు 50వరకు ఉన్నాయి. మిగి లినవి జోనల్‌, రీజనల్‌ పరిధిలో రవాణాసేవలందించే బస్సులు. ఈ బస్సుల ఇంజన్ల సామర్థ్యం పెంచే విధంగా మరమ్మతులు చేపట్టారు. అవసరం మేరకు కొత్త విడిభాగాలు వేశారు. బస్సు పరుగెత్తే టప్పుడు బస్సు బాడీలో వైబ్రేషన్‌ రాకుండా సాంకేతిక లోపాలు సరిచేశారు. పాడైన అద్దాలు, వాటి ప్రేమ్‌లు రీఫిట్‌ చేశారు. ఎలక్ట్రికల్‌ సంబంధించి హెడ్‌లైట్లు, బస్సు లోపలి లైట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసేవిధంగా తయారుచేశారు. టైర్‌ మేనేజ్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేశారు. బస్సు లోపల, వెలుపల పెయింటింగ్‌ చేశారు. పనులు పూర్తి చేసిన బస్సును మెకానికల్‌ ఇంజినీర్లు, ఫోర్‌మెన్‌, ఇతర సాంకేతిక నిపుణుల సమ క్షంలో రోడ్డు టెస్ట్‌ నిర్వహించి సామర్ద్యానికి పరిశీలించి  సంతృప్తికరంగా ఉన్నతరువాత ప్రయాణికుల రవాణా కు వినియోగిస్తున్నారు. ఇలా ఆరునెలల్లో 200 బస్సు లు ఆధునికీకరించినట్టు డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనే జర్లు తెలిపారు. ఈఏడాది మార్చి నుంచి మరో 200 బస్సులు రీఫిట్‌ చేయాలన్నది లక్ష్యమన్నారు.

Updated Date - 2022-04-04T16:28:13+05:30 IST