గుడిబండ: మల్బరీ షెడ్ల నిర్మాణాల్లో ‘ఉపాధి’ బిల్లులు మొండికేశాయి. ఏడాది కాలంగా రైతులకు ఎదురుచూపులే మిగిలా యి. మండలవ్యాప్తంగా 2019-20, 2021-22 సంవత్సరంలో ఉపాధిహా మీ, సెరికల్చర్ శాఖల సంయుక్త ఆధ్వర్వంలో 85 షెడ్లు మంజూరయ్యాయి. పెద్ద షెడ్డుకు రూ.10 లక్షలు, చిన్న షెడ్డుకు రూ.7 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పెద్ద షెడ్డుకు ఉపాధి పథకం కింద రూ.5.50 లక్షలు, సెరికల్చర్ ద్వారా రూ.4 లక్షలు, మినీ షెడ్డుకు ఉపాధి ద్వారా రూ.4 లక్షలు, సెరికల్చర్ ద్వారా రూ.2.25 లక్షల నిధు లు చెల్లించి షెడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
రైతుకు అప్పులే మిగిలాయి..మండలవ్యాప్తంగా 85 మంది రైతులు మల్బరీ సాగు విస్తీర్ణాన్ని బట్టి చిన్న, పెద్ద షెడ్లను అప్పట్లో నిర్మించుకున్నారు. రైతులు అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేసుకోగా, సెరికల్చర్ శాఖ తన వాటా బిల్లులు మాత్రం చెల్లించింది. అయితే నిర్మాణాలకు ఎక్కువ కేటాయింపులు చెల్లించాల్సిన ‘ఉపాధి’ అధికారులు నేటికీ మొండికేస్తున్నారు. అష్టకష్టా లు పడి షెడ్లను నిర్మించుకుంటే, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం తో మల్బరీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. షెడ్ల నిర్మాణాలకు అ ప్పులు చేసి వడ్డీలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. షెడ్ల ని ర్మాణం కోసం ఇసుక, సిమెంటు, ఇనుము, కూలీల బిల్లులు తడిసి మో పెడయ్యాయి. షెడ్ల నిర్మాణాలు పూర్తయి ఏడాది కావస్తున్నా బిల్లుల చె ల్లింపులో జాప్యం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి కైనా ‘ఉపాధి’ అధికారులు వెంటనే మల్బరీ షెడ్లు నిర్మించుకున్న రైతులకు బిల్లులు చె ల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ నరేంద్రకుమార్‌ను వివరణ కోరగా, ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించుకున్న మల్బరీ షెడ్ల రైతులకు త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
ఏడాదిగా బిల్లు అందలేదు- ఎల్ వీరక్యాతరాయప్ప, ఎస్ రాయాపురం
ఏడాది క్రితం మల్బరీ షెడ్డు నిర్మాణాన్ని పూ ర్తి చేశా. సిరికల్చర్ అధికారులు తమ వాటా సొ మ్ము చెల్లించారు. అయితే ఉపాధిహామీ పథకం కింద బిల్లులు నేటికీ అందలేదు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలి.