Abn logo
Dec 3 2020 @ 03:46AM

మోటారు రంగాన్ని కాపాడుకుందాం

రాష్ట్ర సదస్సులో నేతలు


విజయవాడ సిటీ, డిసెంబరు 2: సమైక్య పోరాటం ద్వారా మోటారు రంగాన్ని కాపాడుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జీవో 21ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రగతిశీల ఆటో మోటారు వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఐఎ్‌ఫటీయూ) రాష్ట్ర సదస్సును విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించారు. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్‌ మాట్లాడుతూ పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు, వాహనాల టాక్స్‌లు, పెనాల్టీల పెంపునకు వ్యతిరేకంగా అన్ని సంఘాలు, మోటారు కార్మికులు ఐక్యంగా పోరాడాలన్నారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వైవీ ఈశ్వరరావు, కన్వీనర్‌ దాది శ్రీను, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రవీంద్రనాథ్‌, సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement