ఏపీలో నరేగా నిధుల విడుదల్లో ట్విస్ట్

ABN , First Publish Date - 2021-09-05T01:42:27+05:30 IST

ఏపీలో నరేగా నిధుల విడుదల్లో ట్విస్ట్

ఏపీలో నరేగా నిధుల విడుదల్లో ట్విస్ట్

అమరావతి: సిమెంట్ రోడ్లు వేశారు..ఎమ్ బుక్ రికార్డుల్లో నమోదు చేశారు. క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఎప్టీవో కూడా వచ్చింది. నిధుల విడుదలకు టోకెన్ కూడా జారీ అయింది. నరేగా నిధులు విడుదల చేయాలని సీరియస్‌గా చెప్పింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 


ఏపీలో టీడీపీ హయాంలో ఉపాధి హామీ కింద చేపట్టిన పనులకు నిధులు విడుదల చేయకుండా రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. నిధులు రిలీజ్ చేయాలంటూ టీడీపీతో పాటు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. హైకోర్టుతో పాటు సింగిల్ బెంచ్ కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిధులు రిలీజ్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 



Updated Date - 2021-09-05T01:42:27+05:30 IST