ఇక నుంచి ఏపీలో ఆన్ లైన్ లోనే సినిమా టికెట్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పసరి చేస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్ ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశ పెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్ లో ఇకనుంచి టికెటింగ్ కు అనుమతి లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తరపున బిల్లును ప్రవేశపెడుతూ.. రాష్ట్ర సమాచార ప్రజాసంబంధాల శాఖామాత్యులు పేర్ని నాని బిల్లు లక్ష్యాల్ని, ప్రకటనను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..  


‘క‌ష్ట ప‌డే వారికి వినోదాత్మక‌మైనది సినిమా మాధ్యమం. సినిమా ప‌ట్ల పేద‌,మ‌ధ్యవ‌ర్గాల‌కు ఉన్న ప్రేమ‌ను, ఆపేక్షను, న‌మ్మకాన్ని సోమ్ము చేసుకోవ‌డానికి చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న విధ‌నం ప్రకారం రోజుకు నాలుగు ఆట‌లు వేయాల‌ని చెబుతుండ‌గా తెల్లవారుఝాము నుంచే షోలు వేసి, 300, 500, 1000, 1500 రూపాయ‌లు పెట్టి పేద‌, మ‌ధ్యత‌ర‌గ‌తి నుండి వ‌సూలు చేసి సోమ్ము చేసుకుంటున్నారు. రోజుకు ఆరు, ఏడు, ఎన‌మిది షోలు వేస్తున్నారు. అదేమంటే మా ఇష్టం అన్నట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. సినిమా ప్రద‌ర్శన‌లు  విష‌యంలో ఎవ్వరిష్టం వ‌చ్చిన‌ట్టు వారు య‌దేచ్ఛగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీన్ని నియంత్రించ‌డానికే ఆన్ లైన్ టికెటింగ్ ను తీసుకురావాల‌ని నిర్ణయించాం. ఆన్ లైన్ ద్వారా, థియేట‌ర్ లో కూడా ఆన్లైన్ ద్వారా టికెట్ తీసుకునే అవ‌కాశం కల్పిస్తున్నాం. ఈ విధానంలో ఆన్లైన్ ద్వారా ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌ర్యలు చేప‌డుతున్నాం.త‌ద్వారా ప్రభుత్వం నిర్ధారించిన రేటుకే టికెట్ తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఈ నిర్ణయం‌పై,  ప్రభుత్వంపై బుర‌ద జల్లేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. సినిమా డిస్ట్రిబ్యూట‌ర్‌లు, ఎక్సిబిట‌ర్ లు, నిర్మాత‌లు ప్రభుత్వ నిర్ణయాన్ని త‌ప్పుబడితే తప్పులేదు. కానీ ప్రతిప‌క్షపార్టీ త‌ప్పుప‌డుతోంది, దీన్ని కొన్న ప్రత్రిక‌లు, టీవీలు వాటినే  ప్రాధాన్యంగా చూపుతున్నారు’... అని నానీ అన్నారు. 

Advertisement