Abn logo
Jun 11 2021 @ 11:58AM

మంత్రి మనుషులం.. మమ్మల్నే ఆపుతారా...?

- బళ్లారిలో ఏపీ మంత్రి జయరాం అనుచరుల హల్‌చల్‌

- పోలీసులతో యువకుల వాగ్వాదం

-  స్టేషన్‌కు తరలించి జరిమానా విధించిన రక్షకభటులు


బళ్లారి(కర్ణాటక): ఏపీ మంత్రి జయరాం అనుచరులు కర్ణాటకలో హల్‌చల్‌ చేశారురు. బళ్లారిలో గురువారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే  జయరాం పేరుతో కొందరు పోలీసులపై విరుచుకు పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారులో ఏపీ మంత్రి జయరాం ఎమ్మెల్యే స్టిక్కర్‌ చూపిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు రోడ్డుపై అనవసరంగా ఎవరూ తిరగకుండా పకడ్బంధీగా విధులు నిర్వహిస్తున్నారు.  అనంతపురం రోడ్డు వైపు నుంచి సంగం సర్కిల్‌ వద్దకు ఒక కారు వచ్చింది. అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు వారి వాహనాన్ని ఆపారు. వివరాలపై ప్రశ్నించిన పోలీసులతో మేము మంత్రి జయరాం తాలూకా మనుషులం. అని కాస్త గర్వంగా సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఎవరికో ఫోన్‌ చేసి ఇదో అన్నతో మాట్లాడు అని పోలీసులకు పోన్‌ ఇవ్వబోయారు. అక్కడ  మరింత మంది చేరడంతో ఇది బాగలేదు. మీరు పోలీస్టేషన్‌కు పదండి అని ఆ కారులో ఉండే యువకులను పోలీసులు గాంధీనగర్‌ పోలీస్టేషన్‌కు కారుతో పాటు తరలించారు. పూర్తీ వివరాలు తెలుసుకుని మంత్రి పేరు చెప్పిన యువకులకు, కారుకు ఫైన్‌ వేసి రెండు గంటల తరువాత విడచిపెట్టిరు. ఈ విషయంపై గాంధీనర్‌ పోలీసులను విచారించగా వాళ్లు మంత్రి మనుషులా..? కాదా..? కరెక్టుగా చెప్పలేము. కాకపోతే వారి కారులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామం స్టిక్కర్‌ ఉంది. విచారించాము. కరోనా సమయంలో అనవసరంగా తిరగొద్దండని ఫైన్‌ వేసి పంపామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఈ విషయం బళ్లారిలో హాట్‌ టాఫిక్‌గా మారింది.

Advertisement