Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజకీయ చతురత కలిగిన నేత రోశయ్య: AP Minister

అమరావతి: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అకాల మరణం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ చతురత కలిగిన సీనియర్ నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులు రోశయ్య అని అన్నారు.  రోశయ్య ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు తగ్గట్టు బడ్జెట్ రూప కల్పన చేసిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. రోశయ్య కుటుంబ సభ్యులకు  మంత్రి సురేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement
Advertisement