పారిశుధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-08-12T10:31:34+05:30 IST

స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య కార్మికు లకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, తక్షణం వేతనాలిచ్చి ఆదుకోవాలని ఏపీ మెడికల్‌ ..

పారిశుధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు ఇవ్వండి

పలాస, ఆగస్టు 11: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య కార్మికు లకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, తక్షణం వేతనాలిచ్చి ఆదుకోవాలని ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌, శానిటరీ కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం సీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్నా వేతనాలు ఇవ్వకుండా పస్తులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 549 ప్రకారం వేతనాలు చెల్లింపు, కరోనా రక్షక దుస్తులు, శానిటైజర్లు, గ్లౌజ్స్‌, మాస్కులు  ఇవ్వాలని  కోరారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డి.రమేష్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పి.భవాని, అరుణ, ప్రజా సంఘ నాయకులు ఎం.రామారావు, తామాడ సన్యాసిరావు ఉన్నారు.

Updated Date - 2020-08-12T10:31:34+05:30 IST