ఏపీలో స్థానిక ఎన్నికలు ఇలా జరగబోతున్నాయ్!

ABN , First Publish Date - 2021-01-21T18:22:02+05:30 IST

గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నెలకొన్న

ఏపీలో స్థానిక ఎన్నికలు ఇలా జరగబోతున్నాయ్!

అమరావతి : గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నెలకొన్న పరిస్థితులకు ఇవాళ్టితో దాదాపు ఫుల్‌స్టాప్ పడిన విషయం విదితమే. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన ధర్మాసనం.. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.


హైకోర్టు ఆదేశాల ప్రకారమే..

ధర్మాసనం తీర్పుతో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. అంతేకాదు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లేనని ఎస్ఈసీ అంటోంది. ఎల్లుండి నుంచి నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్‌లు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల కార్యాలయ సిబ్బందితో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు. తీర్పుపై నిమ్మగడ్డ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని స్పష్టం చేశారు.


ఎన్నికలు ఇలా..

ఫిబ్రవరి-05న తొలిదశ పంచాయితీ ఎన్నికలు

ఫిబ్రవరి-09న రెండోదశ పంచాయితీ ఎన్నికలు

ఫిబ్రవరి-13న మూడోదశ పంచాయితీ ఎన్నికలు

ఫిబ్రవరి-17న నాలుగోదశ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెల 23, తొలిదశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ, ఈ నెల 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.



Updated Date - 2021-01-21T18:22:02+05:30 IST