ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేనా?

ABN , First Publish Date - 2021-01-24T01:05:46+05:30 IST

ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేనా?

ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేనా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను రాజ్యాంగ సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయా అంటే పరిస్థితి అలాగే ఉంది. వాతావరణం కొంచెం ఆ దిశగానే వెళ్తున్నట్టు కనబడుతోంది. హైకోర్డు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయింది. అయితే ఎన్నికల కమిషన్ ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ సూచనలు, ఆదేశాల మేరకు పని చేయాలన్నది రాజ్యాంగం నిర్దేశించింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్  వీడియోకాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశారు. అధికారులు, కలెక్టర్లు డుమ్మా కొట్టారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ మరోవైపు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణకు రానుంది. 


ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేనా?. ఎన్నికలు సమ్మతం కాదని ప్రభుత్వమనడం సమంజసమేనా?.  ఉద్యోగ నియమావళిని ఉద్యోగ సంఘాల నేతలు ఉల్లంఘిస్తున్నారా?. అపశృతులు దొర్లితే ప్రభుత్వానిదే బాధ్యత అని నిమ్మగడ్డ హెచ్చరిస్తున్నారా?. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోంది?. అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-01-24T01:05:46+05:30 IST