జాబ్‌ క్యాలెండర్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-06-19T05:15:10+05:30 IST

భానుగుడి (కాకినాడ), జూన్‌ 18: సీఎం జగన్‌ విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను జిల్లాలో ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మర్చువల్‌ విధానంలో 2021-22కి సంబంధించి విద్య, వైద్య,

జాబ్‌ క్యాలెండర్‌ను సద్వినియోగం చేసుకోండి
ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, జేసీ, అధికారులు

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

భానుగుడి (కాకినాడ), జూన్‌ 18: సీఎం జగన్‌ విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను జిల్లాలో ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మర్చువల్‌ విధానంలో 2021-22కి సంబంధించి విద్య, వైద్య, పోలిస్‌ తదితర శాఖల్లో మొత్తం 10,143 ఉద్యోగాల భర్తీకి సంబంధింత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. జిల్లా నుంచి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి, డీఆర్వో సత్తిబాబు పాల్గొన్నారు. యువతను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యంత పారదర్శ కంగా ప్రతీ నెలా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతూ, ఖాళీల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవాలన్నారు. 


స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు

జిల్లాలో ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రూ.20 కోట్ల వ్యయంతో స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు స్థాపించేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని, దీని ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయి పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారితో కలిసి కలెక్టర్‌ వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా స్కిల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లకు సంబంధించి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో అవసరమైన భూ సేకరణ,  అనుమతులు, స్థలం గుర్తింపు పనులకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 28 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకుగాను సుమారు రూ.1.77కోట్ల సబ్సిడీ మంజూరు జరిగిందన్నారు. ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినె్‌సకు సంబంధించి జిల్లాలో 13శాఖల నుంచి 2,746 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. 


కాన్సన్‌ట్రేటర్ల అందజేత

కొవిడ్‌ బాధితుల కోసం గివ్‌ ఇండియా- యాక్షన్‌ ఎయిడ్‌ అసోషియేషన్‌ జిల్లాకు 30 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సమకూర్చింది. శుక్రవారం కలెక్టరేట్‌లో అగ్రికల్చరల్‌ అండ్‌ సోషల్‌ డెవల్‌పమెంట్‌ సోసైటీ(ఏఎ్‌సడీఎస్‌) డైరక్టర్‌, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మాజీ సభ్యు లు వి.గాంధీబాబు కలెక్టర్‌ని కలిసి 5, 10 లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో పాటు ఆటోమేటిక్‌ వోల్టేజ్‌ రెగ్యులేటర్లను అందించారు. కలెక్టర్‌ గివ్‌ ఇండింయా-యాక్షన్‌ ఎయిడ్‌ అసిసోషియేషన్‌కు అభినందనలు తెలిపారు. 


రేపు కొవిడ్‌ స్పెషల్‌ డ్రైవ్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 18: జిల్లావ్యాప్తంగా ఆదివారం చేపట్టనున్న మెగా కొవిడ్‌ వాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డిమురళీధర్‌రెడ్డి వైద్య, ఆరోగ్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన జేసీ కీర్తి చేకూరితో కలిసి కలెక్టరేట్‌లో వాక్సినేషన్‌పై జిల్లా, డివిజన్‌, మండల  స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు లక్ష కొవిషీల్డ్‌ టీకా డోసులు వచ్చినందున 45ఏళ్లు పైబడినవారికి, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు వాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో రిజిష్ట్రేషన్‌, వాక్సినేషన్‌, పరిశీలన గదుల్లో వాక్సిన్‌ వేసుకునేవారు జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి భరతలక్ష్మి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:15:10+05:30 IST