ఏపీ జన్‌కో పాత యూనిట్లను కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-05-13T08:00:20+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం చాపకింద నీరులా పవర్‌సెక్టార్‌పై తన పంజాను విసుతూనే వుంది. ఏపీ జెన్‌కోలోని విద్యుత్‌ కార్మికులకు కం టిమీద

ఏపీ జన్‌కో పాత యూనిట్లను కొనసాగించాలి

ఎర్రగుంట్ల, మే 12: రాష్ట్ర ప్రభు త్వం చాపకింద నీరులా పవర్‌సెక్టార్‌పై తన పంజాను విసుతూనే వుంది. ఏపీ జెన్‌కోలోని విద్యుత్‌ కార్మికులకు కం టిమీద కునునకులేకుండా చే స్తోందని కార్మికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం వీటీపీఎ్‌సలోని 6 పాతయూనిట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీపీపీలోని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ స్పందించిం ది.


మంగళవారం ఏజేసీ ఆధ్వర్యంలోని నాయకులు సీఈ సుబ్రమణ్యంను కలిసి వినతి పత్రం అందజేసి ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న యూనిట్లకు 2024వరకు పీపీఏలున్నాయని కాని రాష్ట్ర ప్రభుత్వం వాటిని మూసివేసే ప్రయత్నాలు చేయడం సరైంది కాదన్నారు. వీటీపీఎ్‌సలోని 6యూనిట్లను మూసివేసేందుకు రిటైర్డ్‌  సీఎండీ గోపాల్‌రెడ్డితో కూడిన 6మంది కమిటీని ఏ ర్పాటు చేయగా ఆ కమిటీ ఏమి రిపోర్టు ఇచ్చిందో  చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటన్నారు.  ఆర్టీపీపీని ఎన్‌టీపీసీలోకి వీలీనం చేసే ప్రయత్నంలో బాగంగా ఒక ఎక్స్‌పర్ట్‌ కమిటీని ఆర్టీపీపీకి పంపగా ఆ కమిటీ ఫిబ్రవరిలోనే రిపోర్టు ఇచ్చినా ఇప్పటికీ బహిర్గతం చేయలేదన్నారు.


అలాగే ఆ రిపోర్టుపై అభిప్రాయాలను తెలపాలని ఏపీ జెన్‌కోలోని అధికారులతో ఒక కమిటీని వేసినా ఇంత వరకు ఎక్స్‌పర్ట్‌ కమిటి ఇచ్చిన రిపోర్టు వివరాలు తెలియకపోవడం శోచనీయమన్నారు.  ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఇప్పటికే వీటీపీఎ్‌సలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రారంభించారని ఆర్టీపీపీలో బుధవారం నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నట్లు జేఏసీ పేర్కొంది. 

Updated Date - 2020-05-13T08:00:20+05:30 IST