27 టీఎంసీలు విడుదల చేయండి: ఏపీ ఇండెంట్‌

ABN , First Publish Date - 2021-07-25T07:57:58+05:30 IST

రాష్ట్రావసరాలకు 27 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ)ని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఈ మేరకు శనివారం కేఆర్‌ఎంబీకి ఇండెంట్‌ను...

27 టీఎంసీలు విడుదల చేయండి: ఏపీ ఇండెంట్‌

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రావసరాలకు 27 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ)ని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఈ మేరకు శనివారం కేఆర్‌ఎంబీకి ఇండెంట్‌ను పంపింది. తెలంగాణ ఇప్పటికే 82.40 టీఎంసీల కృష్ణా జలాలను 66:34 దామాషాలో తన వాటా 299 టీఎంసీల నుంచి వినియోగించుకుందని పేర్కొంది. శ్రీశైలంలోకి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాలు ఉన్నందున పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స) ద్వారా తాగు నీరు, రాయలసీమకు సాగు నీరు, చెన్నైకి తాగునీటి అవసరాల కోసం మొత్తం 27 టీఎంసీలను విడుదల చేయాలని కోరింది. ఇందులో చెన్నై తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్టుకు ఏడు టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీ/జీఎన్‌ఎ్‌సఎ్‌సకు 8 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 2 టీఎంసీలు, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌సకు 7 టీఎంసీలు అవసరమని వివరించింది. 


Updated Date - 2021-07-25T07:57:58+05:30 IST