రమ్య హత్య కేసు నిందితుడిని అరెస్టు చేశాం: హోం మంత్రి సుచరిత

ABN , First Publish Date - 2021-08-24T01:31:03+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన రమ్య హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేశామని

రమ్య హత్య కేసు నిందితుడిని అరెస్టు చేశాం: హోం మంత్రి సుచరిత

గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన రమ్య హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేశామని హోం మంత్రి సుచరిత తెలిపారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వం తరపున ఎస్సీ కమిషన్ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్తామన్నారు. మైనర్ బాలికపై పోలీసు అత్యాచారం చేశారని టీడీపీ నాయకుడు లోకేష్ అనవసర హడావుడి చేస్తున్నారని సుచరిత విమర్శించారు. జరగని అత్యాచారాన్ని జరిగినట్లు లోకేష్ ప్రచారం చేయటం తగదన్నారు. గతంలో దాచేపల్లిలో ఓ చిన్నారిపై అత్యాచారం జరిగితే ప్రతి ఒక్కరికి కానిస్టేబుల్ పెట్టలేమని ఆనాడు చంద్రబాబు అన్నారని,  ఇప్పుడు ఆ విషయం మేం చెబితే తప్పుగా చూస్తున్నారన్నారు. ఓ వైపు దిశ చట్టం లేదని చెబుతున్న లోకేష్ మళ్లీ 21 రోజుల డెడ్ లైన్ ఎలా పెడతారని సుచరిత ప్రశ్నించారు. నిందితులకు శిక్ష విధించే అధికారం కోర్టు పరిధిలో ఉంటుందని హోం మంత్రి సుచరిత అన్నారు. 


Updated Date - 2021-08-24T01:31:03+05:30 IST