కొందరు అధికారుల అత్యుత్సాహాం, కాంట్రాక్టర్‌ల వల్లే ఇదంతా..: సుచరిత

ABN , First Publish Date - 2020-09-26T23:46:49+05:30 IST

గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేటలో దళిత స్మశానవాటికలో సమాధులు కోల్పోయిన

కొందరు అధికారుల అత్యుత్సాహాం, కాంట్రాక్టర్‌ల వల్లే ఇదంతా..: సుచరిత

గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేటలో దళిత స్మశానవాటికలో సమాధులు కోల్పోయిన భాదితులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. శనివారం నాడు స్థానిక ఎమ్మెల్యే విడదల రజనీతో కలిసి స్మశనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సమాధులను పడగొట్టిన సంఘటనపై కలెక్టర్, అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుచరిత.. కొందరు అధికారుల అత్యుత్సాహాం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలనే ఇదంతా జరిగిందన్నారు. 


బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆమె ఆదేశించారు. పూర్వీకుల సమాధులను కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ సంఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ కుట్రకోణం దాగివుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. వీటిపైన విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షిస్తామని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-26T23:46:49+05:30 IST