Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్‌

అమరావతి: డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న.. ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్‌ చూస్తారనే నిబంధనను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని హైకోర్టు పేర్కొంది. యాజమాన్య కోటాను కన్వీనర్‌ భర్తీ చేస్తామన్న ప్రభుత్వ నిబంధనపై రాయలసీమ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. యాజమాన్యం తరపున న్యాయవాదులు ఎం.శ్రీవిజయ్‌, వేదుల వెంకటరమణ, వీరారెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement
Advertisement