అమరావతి : ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడుదల రజని, జక్కంపూడి రాజా, అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపై.. క్రిమినల్ కేసుల ఉపసంహరణపై సుమోటోగా కేసు విచారణ నిర్వహించింది. సుప్రీం తీర్పు మేరకు ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై విచారణ జరిపింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుల ఉపసంహరణకు ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయో రిపోర్టు ఇవ్వాలని.. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు 24కు వాయిదా వేసింది.