జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-28T20:39:39+05:30 IST

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి: న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసుపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్‌ ప్రభాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. తెలుగువారి  ఆత్మగౌరవాన్ని ప్రభాకర్  దెబ్బ తీస్తున్నాడని, అతనిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని నిలదీసింది. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ.. స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విని కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు. కనీసం ఒక్క నోటీసు కూడ ఇవ్వలేక పోయారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని.. ప్రభాకర్‌ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణ శుక్రవారం నాటికి వాయిదా వేసింది. అలాగే రేపు హైకోర్టుకు సీబీఐ ఎస్పీ రావాలని, ఎటువంటి చర్యలు తీసుకున్నది చెప్పాలని స్పష్టం చేసింది.

Updated Date - 2021-10-28T20:39:39+05:30 IST