ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-10-05T20:34:38+05:30 IST

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

అమరావతి: ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. 1013 పిటిషన్ల బిల్లుల చెల్లింపుల్లో తీర్పు వెల్లడించింది. నాలుగు వారాల్లోగా బిల్లులు మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టేసింది. బకాయిలను 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా బిల్లులు చెల్లించాలని, ఇప్పటికే కొంత చెల్లిస్తే మిగితాది కూడా 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.

Updated Date - 2021-10-05T20:34:38+05:30 IST