అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి సందర్భంగా జరిగిన గొడవలో టీడీపీ నేతలపై పోలీసులు మోపిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఇతర సెక్షన్లు కింద నమోదైన కేసుల్లో రిలీఫ్ వచ్చింది. ఏడు సంవత్సరాల లోపు శిక్షపడే అవకాశం ఉండటంతో... సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. నాదెళ్ల బ్రహ్మం కేసులో కూడా 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారణకు పిలిచేందుకు అవకాశముంది. టీడీపీ నేతల తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.