Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు జస్టిస్‌

దేవుని కడప వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న హైకోర్టు జస్టిస్‌ వెంకటరమణ దంపతులు

కడప మారుతీనగర్‌, అక్టోబరు 24: ఆంధ్రప్రదేశ్‌ హైకో ర్టు జస్టిస్‌ ఎం.వెంకటరమణ  ఆదివారం తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. కడప పర్యటనలో భాగంగా ఆయన  సతీసమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ స్వామి వారి దర్శన ం మనస్సును తేలికపరిచినట్లయిందన్నారు. కార్యక్రమంలో దేవునికడప ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement