దుల్హన్‌ పధకంపై వెంటనే నిర్ణయం తీసుకోండి: AP high court

ABN , First Publish Date - 2022-07-07T19:47:53+05:30 IST

రాష్ట్రంలో నిలిపివేసిన దుల్హన్ పధకం(Dulhan scheme)పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు(High court) ఆదేశాలు జారీ చేసింది.

దుల్హన్‌ పధకంపై వెంటనే నిర్ణయం తీసుకోండి: AP high court

అమరావతి: రాష్ట్రంలో నిలిపివేసిన దుల్హన్ పధకం(Dulhan scheme)పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు(High court) ఆదేశాలు జారీ చేసింది. గతంలో దుల్హన్ పధకం అమలు చేయడం లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత షుబ్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దుల్హన్ పధకాన్ని రద్దు చేశామని, నిధులు లేకపోవడం వల్ల ఉపసంహరించుకున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఈరోజు మరోసారి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దుల్హన్‌ ఆపేశామన్నారు కదా.. ఏం జరిగిందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దుల్హన్ పధకం రద్దు చేశామని చెప్పడం పొరబాటని దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని  ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇదే చివరి అవకాశమని వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున సీనియర్ న్యాయవాది మొహ్మద్ సలీం భాషా వాదనలు వినిపించారు. 

Updated Date - 2022-07-07T19:47:53+05:30 IST