సినిమా టికెట్ల ధరలపై AP highcourt ఆదేశాలు ఇవీ..

ABN , First Publish Date - 2021-12-16T17:37:27+05:30 IST

సినిమా టికెట్ల ధరలపై AP highcourt ఆదేశాలు ఇవీ..

సినిమా టికెట్ల ధరలపై AP highcourt ఆదేశాలు ఇవీ..

అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌కు ఏపీ ప్రభుత్వం వెళ్లింది. జీవో 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. సింగిల్‌ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్‌ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2021-12-16T17:37:27+05:30 IST