AP highcourt: గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-12-15T19:25:21+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ1గా ఉన్న గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టుల విచారణ రేపటి(గురువారం)కి వాయిదా పడింది.

AP highcourt: గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ1గా ఉన్న గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ రేపటి(గురువారం)కి వాయిదా పడింది. సుబ్బారావుకు వెంటనే బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు  వాదనలు వినిపించారు. తమకు వాదనలు వినిపించేందుకు సమాచారం రావాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇందుకు కోసం వారం రోజుల సమయం కోరారు. అయితే వారం రోజులు ఇవ్వటం సాధ్యం కాదని రేపు ఉదయానికి సమాచారం తప్పించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినేందుకు ఈ కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-15T19:25:21+05:30 IST