రాజధాని అమరావతి కేసులపై ఏపీ High courtలో విచారణ

ABN , First Publish Date - 2021-11-16T19:29:05+05:30 IST

రాజధాని అమరావతి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

రాజధాని అమరావతి కేసులపై ఏపీ High courtలో విచారణ

అమరావతి: రాజధాని అమరావతి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్స్ తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి కీలక అంశాలను శ్యామ్ దివాన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని అమరావతి కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని.. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి కోసం వెలకట్టలేని త్యాగాలు చేశారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. భూములు ఇచ్చింది...రాష్ట్ర అభివృద్ధి కోసమని.... రాజకీయ విద్వేషంతో అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్‌గా మార్చేసిందని హైకోర్టులో  న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. 

Updated Date - 2021-11-16T19:29:05+05:30 IST