నేర చరిత్ర ఉన్నవారిని TTD బోర్డులో సభ్యులుగా నియమించడంపై హైకోర్టు సీరియస్

ABN , First Publish Date - 2021-10-27T17:08:15+05:30 IST

టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేర చరిత్ర ఉన్నవారిని TTD బోర్డులో సభ్యులుగా నియమించడంపై  హైకోర్టు సీరియస్

అమరావతి: టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకమండలి సభ్యులుగా నేర చరిత్ర ఉన్న వారిని నియమించారంటూ జీవోను సవాల్ చేస్తూ  హైకోర్టులో బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. భాను ప్రకాష్ పిటిషన్‌పై న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై అశ్విని కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-10-27T17:08:15+05:30 IST