క‌రోనా నివార‌ణ చ‌ర్యల‌పై AP Highcourtలో విచార‌ణ‌

ABN , First Publish Date - 2021-08-31T19:28:26+05:30 IST

రాష్ట్రంలో క‌రోనా నివార‌ణ చ‌ర్యల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ‌ జరిగింది.

క‌రోనా నివార‌ణ చ‌ర్యల‌పై AP Highcourtలో విచార‌ణ‌

అమరావతి: రాష్ట్రంలో క‌రోనా నివార‌ణ చ‌ర్యల‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచార‌ణ‌ జరిగింది. చిత్తూరు, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో కేసులు పెర‌గ‌డం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై ధర్మాసనం ఆరా తీసింది.  45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్టు కోర్టుకు ప్రభుత్వం  తెలియజేసింది. అలాగే మిగిలిన వారికి వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుంద‌ని అఫిడ‌విట్ దాఖ‌లు  చేసింది.సెప్టెంబ‌ర్ 8 నాటికి స్టేట‌స్ రిపోర్టు దాఖ‌లు చేయాల‌ని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కొవిడ్ నియంత్రణ‌కు ప్రత్యేక చ‌ర్యలు చేప‌ట్టాలని హైకోర్టు ఆదేశించింది. పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది న‌ర్రా శ్రీ‌నివాస్‌ వాద‌న‌లు వినిపించారు. 

Updated Date - 2021-08-31T19:28:26+05:30 IST